Godavari Pushkaralu | పుష్కరాల కోసం బస్టాండ్ల అభివృద్ధి : మంత్రి పొన్నం

గోదావరి పుష్కరాల కోసం బస్టాండ్లను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల కోసం బస్టాండ్లను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) బస్ స్టేషన్‌ను రూ.2.57 కోట్లతో ఆధునీకరించే పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​తో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. వీటి కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. పుష్కర ఘాట్లు, రోడ్లు ఇతర వసతులు కల్పిస్తోంది. అంతేగాకుండా నదీ పరివాహక ప్రాంత ఆలయాలను సైతం అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా గోదావరి తీరాన గల బాసర నుంచి భద్రాచలం వరకు ప్రముఖ పుణ్యక్షేత్రాల బస్టాండ్లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Godavari Pushkaralu | భక్తులకు ఇబ్బందులు లేకుండా..

ధర్మపురి బస్టాండ్​ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త టాయిలెట్ బ్లాక్, సీసీ పేవ్‌మెంట్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ధర్మపురికి బస్ డిపో ఏర్పాటు చేసేలా స్థల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు.

Godavari Pushkaralu | ఆలయంలో ప్రత్యేక పూజలు

మంత్రి పొన్నం అంతకుముందు ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని, ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.

దీనిని కూడా చదవండి : Harish Rao Pending Bills | దివ్యాంగులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *