Metro Phase 2 | కేంద్రం దిగిరావాల్సిందే.. సీఎం కీలక వ్యాఖ్యలు

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనంతో పాటు పలు అభివృద్ధి పనుల సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Metro Phase 2 | కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మెట్రో ఫేజ్​–2కు అనుమతులతో పాటు వడ్లు, మక్కలు కొనాల్సిందే అని పేర్కొన్నారు.

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనంతో పాటు పలు అభివృద్ధి పనుల సీఎం ఆదివారం శంకుస్థాపన చేశారు. 10 ఎకరాల్లో రూ.98 కోట్లతో మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనం నిర్మించనున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి (Malkajgirir) అభివృద్ధిపై దృష్టి పెట్టానని చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల్లో లబ్ధి కోసం మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు చేశారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. కానీ తాము పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు చేశామని వెల్లడించారు. మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తానని తెలిపారు.

Metro Phase 2 | బీఆర్​ఎస్​తో కిషన్​రెడ్డి లాలూచీ

కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన అనుమతులతో పాటు రైతుల వడ్లు, మొక్కజొన్నలను కేంద్రం కొనాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 15 తర్వాత దీనిపై ఖచ్చితమైన కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పగలు బీజేపీలో ఉంటూ, చీకట్లో కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Metro Phase 2 | అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి

నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రతిపాదనలు చేశామని, 122 కి.మీ మేర మెట్రో పొడిగింపునకు అన్ని అనుమతులు వచ్చాక.. ఇక్కడి కేంద్రమంత్రి ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను నిలదీసి అడగాల్సిన అవసరం లేదా అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నా.. అనుమతులు రాకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.

 

ఇది కూడా చదవండి : Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *