VinFast Car Issue | షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. తమకు సంబంధం లేదన్న సిబ్బంది.. కస్టమర్​ ఆందోళన

ఈ ఘటన కొత్త వాహనాల నాణ్యత ప్రమాణాలు, డెలివరీకి ముందు నిర్వహించే తనిఖీలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VinFast Car Issue | లక్షల రూపాయలు వెచ్చించి కొత్త కారు కొనుగోలు చేసిన వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్​ రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూం నుంచి డెలివరీ తీసుకున్న కొద్ది సేపటికే రూ.25 లక్షల విలువైన కారు షోరూం బయటే ఆగిపోవడంతో కస్టమర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

VinFast Car Issue | సాంకేతిక సమస్యతో..

బాధితుడి కథనం ప్రకారం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన అనంతరం షోరూం నుంచి బయటకు తీసుకువచ్చిన వెంటనే కారు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో వెంటనే షోరూం సిబ్బందిని సంప్రదించి సమస్యను వివరించినట్లు తెలిపారు.

VinFast Car Issue | సంస్థ ప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి

అయితే సమస్య పరిష్కారంపై స్పందించాల్సిన షోరూం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. “కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు” అంటూ తనను షోరూం నుంచి బయటకు పంపించారని వాపోయారు.

లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కొత్త వాహనం డెలివరీ రోజునే పనిచేయకపోవడం, పైగా బాధ్యతాయుతంగా స్పందించాల్సిన సంస్థ ప్రతినిధులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

HK1o0DNbkAAitQd

VinFast Car Issue | తనిఖీలపై ప్రశ్నలు

ఈ ఘటన కొత్త వాహనాల నాణ్యత ప్రమాణాలు, డెలివరీకి ముందు నిర్వహించే తనిఖీలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో షోరూం యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఈ ఘటనపై షోరూం యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *