School Bandh Telangana | జూన్ 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి: ఏబీవీపీ

రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ బంద్‌కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: School Bandh Telangana | అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు ఏబీవీపీ కూకట్‌పల్లి జిల్లా నాయకులు వెల్లడించారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు పిలుపునిచ్చారు.

School Bandh Telangana | సర్కారు విఫలం..

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించడం వంటి డిమాండ్ల సాధన కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

School Bandh Telangana | విజయవంతం  చేయాలి..

రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ బంద్‌కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు.

విలేకరుల సమావేశంలో ఏబీవీపీ కూకట్‌పల్లి జిల్లా కన్వీనర్ పడమటి భరత్, సవిష్కార్ రాష్ట్ర సహ-కన్వీనర్ గోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాఘవేంద్ర, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నిహాల్, జిల్లా స్టూడెంట్స్ ఫర్ సేవా (ఎస్‌ఎఫ్‌ఎస్) కన్వీనర్ కార్తీక్ పాల్గొన్నారు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *