అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PMJ Jewellery Case | కరీంనగర్ (Karimnagar)లోని పీఎంజే జువెల్లరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన రెండు గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు గురించి ఆదివారం సీపీ గౌస్ ఆలం (CP Ghouse Alam) మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ షోరూమ్‌లో మే 3న దోపిడీ జరిగింది. దుండగులు తుపాకులతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలతో పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సీపీ మాట్లాడుతూ.. అదృశ్యమైన బంగారం, వజ్రాభరణాల విషయంలో నిందితులు తమ వాంగ్మూలాలను మారుస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని గౌష్ ఆలం ఆదివారం తెలిపారు.

PMJ Jewellery Case | వెలిచాల బైపాస్ సమీపంలో..
నాలుగు రోజుల కస్టడీ సమయంలో వెలిచాల బైపాస్ సమీపంలోని పొదల్లో దాచి ఉంచిన రెండు పిస్టళ్లను, అటవీ ప్రాంతం వద్ద పడేసి వెళ్ళిన ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో, మరో కీలక నిందితుడిని (A-10) బీహార్‌లో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై అతన్ని కరీంనగర్‌కు తరలిస్తున్నారు. మిగిలిన నిందితులు, దోచుకున్న ఆభరణాల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు నిందితులను మరోసారి కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. కాగా బీహార్‌కు చెందిన ముఠా ఈ దోపిడీ చేసింది.
#PMJJewellery #RobberyCase Update | #Karimnagar@KarimnagarCp Gaush Alam on Sunday said the accused tried to mislead police by changing statements on the missing #gold and #diamondornaments.
During four days of custody, cops recovered two pistols hidden in bushes near… pic.twitter.com/ZsnoNM7PH1
— NewsMeter (@NewsMeter_In) June 7, 2026
దీనిని కూడా చదవండి : Telangana Academic Calendar | తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. సెలవుల పూర్తి షెడ్యూల్ ఇదే!
