అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karimnagar Tension | కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) క్యాంపు కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కొందరు బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆయన కారుతో పాటు కమలాకర్ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
Karimnagar Tension | బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో..
కరీంనగర్‌లోని ఎమ్మలె గంగుల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Kaushik Reddy) గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే అందువల్లే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోయాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని.. అయితే సంజయ్ కూడా టెస్టులకు రావాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్.. గతంలో తన భార్య పుస్తెలు అమ్మి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారని.. మరి కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ నిలదీశారు.

Karimnagar Tension | తీవ్ర ఉద్రిక్తత
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు(BJP Leaders) గంగుల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)పై వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. అలాగే క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టి , ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు.. బండి సంజయ్ కారును బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఇది కూడా చదవండి..: Karimnagar Jewellery Robbery | కరీంనగర్ జ్యూవెలరీ దోపిడీ కేసులో సంచలన మలుపు.. ఆ గ్యాంగ్ హస్తం ఉందని నిర్ధారణ?

