Nizamabad SIR Protest | ఎస్​ఐఆర్​ అమలును నిరసిస్తూ జ్ఞానేష్​ కుమార్​ దిష్టిబొమ్మ దహనం

ఎస్​ఐఆర్​ను వెంటనే రద్దుచేయాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad SIR Protest | ఎస్​ఐఆర్​ను (SIR) వెంటనే రద్దుచేయాలని కాంగ్రెస్​ నాయకులు నినదించారు. నగరంలోని (Nizamabad) ఎన్టీఆర్​ చౌరస్తాలో బుధవారం ఎలక్షన్​ కమిషన్​ ఛైర్మన్​ జ్ఞానేష్​ కుమార్​ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

Nizamabad SIR Protest | జ్ఞానేష్ కుమార్​ రాజీనామా చేయాలి

డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి, కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎస్​ఐఆర్​ను వెంటనే రద్దు చేయాలని, జ్ఞానేష్​కుమార్​ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఎస్​ఐఆర్​ కారణంగా కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓట్​ చోరీ ద్వారా బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతోందని.. అందుకే ఎస్​ఐఆర్​ తీసుకొచ్చిందని ఆరోపించారు.

Nizamabad SIR Protest | పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట..

ఈ క్రమంలో జ్ఞానేష్​ కుమార్​ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు, కాంగ్రెస్​ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు దిష్టిబొమ్మను దహనం చేయకుండా ఆపేందుకు ప్రయత్నించారు. కార్యక్రమంలో ఆర్మూర్ (Armoor)​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​రెడ్డి, సీనియర్​ నాయకులు నరాల సుధాకర్​, శరత్​, వరదబట్టు వేణురాజ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: హస్తినకు బయలుదేరిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో కీలక భేటీలు! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *