Vivo V80 5G | సరికొత్త ప్రీమియం ఫోన్ లాంచ్ చేసిన వీవో.. అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి..

వివో తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ అయిన వీ80 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అక్టోబర్ 13 న సేల్ ప్రారంభం కానుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo V80 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన వీవో మరో ప్రీమియం మోడల్‌ను భారత మార్కెట్‌లో పరిచయం చేసింది. 7200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది. అక్టోబర్ 13న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు వివో ఇండియా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. ప్రీ ఆర్డర్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.59 ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1260 x 2750 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ఐపీ68/ ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ జెడఈఐఎస్ఎస్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

Vivo V80 5G | బ్యాటరీ సామర్థ్యం..

7200 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 90 డబ్ల్యూ ఫ్లాష్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Vivo V80 5G | వేరియంట్లు..

సన్ రైజ్ ఆన్తమ్, హారిజాన్ బ్లూ, స్టెల్లర్ బ్లాక్ కలర్‌లలో 3 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 62,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999.
8 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999.

Vivo V80 5G | కార్డ్ ఆఫర్లు..

ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు ధర వర్తించనుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..: Tallentex 2027 | విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. 90% వరకు స్కాలర్‌షిప్‌లతో అలెన్ టాలెంట్‌టెక్ పరీక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *