Tallentex 2027 | విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. 90% వరకు స్కాలర్‌షిప్‌లతో అలెన్ టాలెంట్‌టెక్ పరీక్ష

దేశవ్యాప్తంగా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రముఖ విద్యా సంస్థ ‘అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్’ టాలెంట్‌టెక్-2027 (Tallentex-2027) పరీక్షను నిర్వహిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tallentex 2027 | దేశవ్యాప్తంగా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రముఖ విద్యా సంస్థ ‘అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్’ టాలెంట్‌టెక్-2027 (Tallentex-2027) పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం విద్యార్థుల నుంచి భారీ స్పందన లభిస్తుండగా, రిజిస్ట్రేషన్లకు అక్టోబర్ 11 చివరి తేదీగా నిర్ణయించారు.

Tallentex 2027 | పరీక్ష తేదీలు..

టాలెంట్‌టెక్-2027 పరీక్షను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ఆఫ్‌లైన్ పరీక్ష అక్టోబర్ 25న జరగనుండగా, ఆన్‌లైన్ పరీక్షలు అక్టోబర్ 25, 28 , 31 తేదీలలో నిర్వహించనున్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఇప్పటికే అలెన్ క్లాస్‌రూమ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనవచ్చు.

Tallentex 2027 | నగదు బహుమతులు..

అలెన్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 21 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలో భాగస్వామ్యులయ్యారని తెలిపారు. పరీక్ష ముగిసిన తర్వాత జాతీయ , రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తారు. అంతేకాకుండా, మొత్తం రూ.2.50 కోట్ల నగదు బహుమతులు , అలెన్ కోర్సుల్లో ప్రవేశం కోసం 90 శాతం వరకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నారు.

Tallentex 2027 | ప్రత్యేకతలివే..

పరీక్ష ఫలితాలతో పాటు ప్రతి విద్యార్థికి ‘కాంపిటేటివ్ సక్సెస్ ఇండెక్స్’ (CSI) అందజేస్తారు. ఇది విద్యార్థుల పోటీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సహాయపడే ప్రత్యేక పనితీరు సూచిక. దీని ద్వారా విద్యార్థులు జేఈఈ (JEE), నీట్ (NEET) లాంటి ఇతర పోటీ పరీక్షల్లో తమ జాతీయ ర్యాంకులను అంచనా వేసుకోవచ్చు. ఈ పరీక్ష రెండు గంటల పాటు జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ , లాజికల్ మెంటల్ ఎబిలిటీ నుంచి మల్టిపుల్ ఛాయిస్ (MCQ), ఇంటిజర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ (NCERT) సిలబస్ ఆధారంగా ఉంటుంది.

ఆసక్తి గల విద్యార్థులు https://allen.in/tallentex వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే పోర్టల్‌లో అందుబాటులో ఉండే ప్రాక్టీస్ టెస్ట్ పేపర్లను కూడా విద్యార్థులు ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పరీక్షా విధానం, సిలబస్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి:  Cow Protection | గోసేవ, గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *