అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. సీఎం, పీఎంగా ఆయన 25 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మేము దీన్ని సాధిస్తాం” (We Will Do It) అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు.
ఓట్ల ప్రాతిపదికన సమాజం విడిపోవడం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఒక రైతు పొలంలో నీరు లేనప్పుడు, ఆ సమస్య కేవలం ఒక కులానికే పరిమితం అవుతుందా అని ప్రశ్నించారు. సమస్య అందరికీ సంబంధించినదైనప్పుడు, పరిష్కారం కూడా అందరికీ ఉండాలి అన్నారు.
PM Modi | ఆ లక్ష్యాలు సాధిస్తాం
వంద ఏళ్ల క్రితం మన జనాభా 40 కోట్లలోపు ఉండేదని మోదీ అన్నారు. నేడు 140 కోట్లకు పైగా చేరినట్లు చెప్పారు. 140 కోట్ల మంది పౌరులు కలిసి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తారన్నారు. 2047 నాటికి అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం, స్వయం సమృద్ధి, ప్రపంచ తయారీ కేంద్రం, ఒలింపిక్స్ నిర్వహణ, అంతరిక్షంలోకి అడుగుపెట్టడం వంటి లక్ష్యాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Repo Rate Hike | వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ.. పెరగనున్న ఈఎంఐల భారం