Rahul Gandhi Notice | రాహుల్ గాంధీకి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు.. మోడీ, అమిత్ షాలపై తీవ్ర ఆగ్రహం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rahul Gandhi Notice | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఆయనకు లోక్‌సభ స్పీకర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల నిరసనలపై జరిగిన చర్చలో రాహుల్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఎంపీ అనురాగ్ ఠాకూర్ (MP Anurag Thakur) ఫిర్యాదులో పేర్కొన్నారు.

Rahul Gandhi Notice | రాహుల్ ఫైర్..

ఈ నోటీసులపై రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. దేశంలోని యువతను భయపెట్టి ఎవరూ సైలెంట్ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి.. “మీరిద్దరూ భారతదేశ గతం మాత్రమే.. దేశ భవిష్యత్తు అయిన యువతతో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Rahul Gandhi Notice | యువత హక్కులను కాలరాయలేరు..

విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, వారి సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం వెనుక ప్రధాని, హోంమంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. మొదట దాడులు చేసి, ఇప్పుడు డిజిటల్ ఆంక్షలు, చట్టపరమైన కేసులతో బెదిరించాలని చూస్తున్నారని, రాజ్యాంగబద్ధమైన యువత హక్కులను ఎవరూ కాలరాయలేరని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Meta India Case | మెటాకు​ షాక్​.. సంస్థ ఇండియా హెడ్‌పై కేసు నమోదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *