అక్షరటుడే, వెబ్‌డెస్క్: CCPA Dark Patterns | డార్క్ ప్యాటర్న్‌తో వినియోగదారులను మోసం చేస్తున్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం షాక్ ఇచ్చింది. జెప్టో, బుక్‌మైషో, ఇండిగో (Indigo) సహా 9 యాప్‌లకు రూ.20 లక్షల జరిమానా విధించింది.
ప్రజలు ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తారు. దానిని ఓపెన్ చేయగానే తక్కువ ధర కనిపిస్తుంది. తీరా బుక్ చేసే సమయంలో దాని ధర పెరుగుతుంది. అంతేగాకుండా హ్లాండ్లింగ్ ఫీజు వసూలు చేస్తారు. విరాళం పేరిట కొంతమొత్తం అల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇవి చిన్నమొత్తాలుగా కనిపించినా.. వినియోగాదారులకు తెలియకుండా.. అవసరం లేకుండా ఆయా కంపెనీలు వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి పద్ధతులపై మరింత నిశితంగా దృష్టి సారిస్తోంది.
CCPA Dark Patterns | కేంద్రం చర్యలు
వినియోగదారులు తాము చేయాలనుకోని ఎంపికలు చేసేలా వారిని తారుమారు చేయగల వెబ్సైట్, యాప్ డిజైన్లైన “డార్క్ ప్యాటర్న్స్”ను ఉపయోగించినందుకు, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తొమ్మిది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై జరిమానా విధించింది. ప్రభుత్వం ఈ చర్య గురించి రాజ్యసభకు తెలియజేసింది. ఈ జాబితాలో జెప్టో, బుక్‌మైషో, ఇండిగో, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు ఉన్నాయి. జెప్టో వినియోగదారులకు మొదట చూపిన ధరలను, ఆ తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జీలు, సభ్యత్వ రుసుముల ద్వారా పెంచినట్లు CCPA కనుగొంది. దీంతో జెప్టోకు రూ. 7 లక్షల జరిమానా విధించింది.
CCPA Dark Patterns | రూపాయి విరాళం
బుక్‌మైషో బుక్ఎ-స్మైల్ ఛారిటీ కార్యక్రమానికి ముందుగా టిక్ చేసిన రూ. 1 విరాళాన్ని తొలగించమని అధికారులు ఆదేశించారు. విరాళం రూపాయి అయినప్పటికే.. అది ముందుగానే సెలెక్ట్ చేసి ఉండటంపై సీసీపీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని బాస్కెట్ స్నీకింగ్గా వర్గీకరించింది. మరోవైపు, ‘కన్ఫర్మ్ షేమింగ్’ అనే వేరొక ఎత్తుగడను అనుసరించినందుకు ఇండిగో విమర్శలకు గురైంది. ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ఫిజిక్స్ వాలాకు చెందిన PW ఫౌండేషన్‌కు ఇచ్చే రూ.10 విరాళం ఆటోమేటిక్‌గా ముందే ఎంపిక చేయబడిందని CCPA కనుగొన్న తర్వాత, దానికి రూ.5 లక్షల జరిమానా విధించింది. దీంతో ఫిజిక్స్ వాలా జరిమానాను చెల్లించి, డార్క్ ప్యాటర్న్స్‌గా గుర్తించిన పద్ధతులను నిలిపివేసింది. ఫస్ట్‌క్రై, ఫార్మ్ఈజీ, మెకాఫీ, స్పైస్‌జెట్, కోచింగ్ ప్లాట్‌ఫామ్ అనుజ్ జిందాల్‌పై కూడా CCPA జరిమానాలు విధించింది.
ఇది కూడా చదవండి..: Tarun Tejpal | లైంగిక దాడి కేసు.. ‘తెహల్కా’ తరుణ్ తేజ్పాల్ను దోషిగా తేల్చిన కోర్టు