అక్షరటుడే, ఇందూరు/బాన్సువాడ: Professor Jayashankar | తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కంఠేశ్వర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
Professor Jayashankar | బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..
జయశంకర్ సార్ సిద్ధాంతమే లేకుంటే తెలంగాణ (Telangana) రాష్ట్రసాధన సాధ్యమయ్యేది కాదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఆయన నిస్వార్థ సేవలను, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సైద్ధాంతిక భరోసాను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన 1200మంది వీరుల్లో సింహభాగం బీసీలు ఉన్నారని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నర్సయ్య, రేఖ, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు
Professor Jayashankar | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో..
టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్ నివాళులర్పించారు. కార్యక్రమంలో TNGO రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, టీఎన్జీవోస్ ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.
Professor Jayashankar | బాన్సువాడ పట్టణంలో..
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన చూపిన మార్గదర్శకత్వం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.
ఇది కూడా చదవండి..: Sriramsagar Project | ఖరీఫ్‌పై ఆశలు పెంచుతున్న శ్రీరాంసాగర్