అక్షరటుడే, ఇందూరు: Fee Reimbursement | రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
Fee Reimbursement | విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో..
దినేష్ పటేల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు చదువు కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తేడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. బకాయిలు చెల్లించకపోతే ఇందూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
Fee Reimbursement | విద్యార్థుల కోసం నిరంతర పోరాటం
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై బీజేవైఎం నిరంతరం పోరాడుతుందన్నారు. సంతకాల సేకరణ ద్వారా విద్యార్థుల గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓంసింగ్, బీజేవైఎం నాయకుడు సాయి ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Tirmalapur Gram Sabha | గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం.. తిర్మలాపూర్ జీపీలో తీర్మానాలు