అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Bhavesh Mishra | నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.45 గంటల సమయంలో కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు.
Bhavesh Mishra | శాఖల పనితీరుపై సమీక్ష
కలెక్టరేట్‌కు చేరుకున్న భవేష్ మిశ్రా నేరుగా తన ఛాంబర్‌కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వివరాలు తెలుసుకున్నారు. మొదటిసారిగా జిల్లాకు వచ్చిన భవేష్ మిశ్రాకు అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మూడు నెలల పాటు ప్రసూతి సెలవులో ఉన్నారు. ఇటీవలే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇలా త్రిపాఠికి భర్త కావడం విశేషం. ఆయన ప్రస్తుతం నిర్మల్ జిల్లాకు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy Sergio Gor | తెలంగాణ విద్యార్థుల కోసం అమెరికా వీసాలు పెంచాలి : యూఎస్ రాయబారితో సీఎం రేవంత్