Drunk Driving | తనిఖీలు చేస్తున్నా తగ్గని మందుబాబులు.. వారంరోజుల్లో 64 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదు

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో వారంరోజుల్లో 64 కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Driving | నిజామాబాద్​ కమిషనరేట్ ​(nizamabad commissionerate) పరిధిలో పోలీసులు డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మందుబాబుల్లో మార్పు రావట్లేదు. భారీగా జరిమానాలు విధిస్తూ.. జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ భయం లేకుండా మళ్లీ మద్యం తాగి రోడ్లపైకి వస్తున్నారు.

Drunk Driving | వారంరోజుల్లో..

కమిషనరేట్​ పరిధిలోని నిజామాబాద్​ ట్రాఫిక్(Nizamabad traffic police)​, బోధన్​, ఆర్మూర్​ పరిధుల్లో వారం రోజుల్లో పోలీసులు డ్రంకన్​డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 64మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించారు. అనంతరం వారిని ఆయా కోర్టులో ప్రవేశపెట్టగా.. 9మందికి వారంరోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.5,50,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) ప్రకటన విడుదల చేశారు. మద్యం తాగి ఎట్టిపరిస్థితుల్లో రోడ్లపైకి రావొద్దని సూచించారు. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడితే ఆర్నెళ్ల పాట డ్రైవింగ్​ లైసెన్స్​ రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Money Mule Scam | ఖాతాదారులకు ఆర్బీఐ కీలక హెచ్చరిక.. ఇలా చేస్తే జైలుకే

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *