MLA Rakesh Reddy | ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్​ నాయకుల మెడళ్లోంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని సూచన

కాంగ్రెస్​ నాయకుల మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: MLA Rakesh Reddy | కాంగ్రెస్​ నాయకుల మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లండని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి పేర్కొన్నారు. అంకాపూర్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

MLA Rakesh Reddy | ఇచ్చిన హామీని కాంగ్రెస్​ మరిచించి..

కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామ హామీ ఇచ్చి తుంగులో తొక్కిందని రాకేష్​ రెడ్డి అన్నారు. మహిళలకు తాను అండగా ఉంటానన్నారు. మహిళలు ధైర్యంగా ఆ బంగారు గొలసులను అమ్మేసి తనకు రిసిప్ట్​ పెట్టాలని సూచించారు. స్కూటీలు ఇస్తామని సైతం హామీ ఇచ్చి మోసం చేసిందని కాంగ్రెస్​ నాయకుల షోరూంలలో నుంచి స్కూటీలు సైతం ఎత్తుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించుతామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

MLA Rakesh Reddy | చర్చకు రాకేష్​ రెడ్డి సిద్ధం : దినేష్ ​కులాచారి

కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులతో చర్చకు రాకేష్​ రెడ్డి సిద్ధంగా ఉన్నారని.. పోలీసులే హౌస్​ అరెస్ట్​ చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు. ఎల్​నినో ప్రభావంతో జిల్లా ఏడారిగా మారుతోందన్నారు. జిల్లాకు అన్నపూర్ణగా ఉన్న శ్రీరాంసాగర్​ ఈరోజు నీళ్లు లేక వెలవెలబోతోందన్నారు. అలాగే రైతులు సైతం నాట్లు వేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మహేష్​ కుమార్​ గౌడ్​ను తాము అంకాపూర్​కు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ఇందూరులోనే ఉన్నారని.. ఎమ్మెల్యే ఇంటికి వస్తే అంకాపూర్​ చికెన్​తో భోజనం పెట్టిస్తామని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఆర్మూర్​, ఇందూరు అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు.

ఇది కూడా చదవండి..: Bahrain Labour Union | బహ్రెయిన్‌ ‘ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్’ అధ్యక్షుడి రాజీనామా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *