అక్షరటుడే, కామారెడ్డి: Basara IIIT Student Aid | ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం సహకరిస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. ఆర్జీయూకేటీ బాసర్ క్యాంపస్‌లో చదువుతున్న కామారెడ్డి జిల్లా విద్యార్థిని నిఖిత ఆర్థిక సహాయం కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.
Basara IIIT Student Aid | కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో..
కుటుంబ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, ఆదివారం తన కార్యాలయంలో రూ.10 వేల విలువైన చెక్కును రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అందజేశారు. పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ప్రయాణ ఖర్చులకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్థిక కారణాలతో చదువు ఆపకుండా పట్టుదలతో ముందుకెళ్లి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. సహాయం అందినందుకు నిఖిత కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజన్న, నరసింహులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Government School Admissions | ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడి.. రికార్డు స్థాయిలో అడ్మిషన్లు..