Shankh Mitra Salary | ఏడాది వేతనం రూ. 7 వేల కోట్లు!.. ప్రపంచంలోనే రెండో అత్యధిక ప్యాకేజీ పొందుతున్న శంఖ్ మిత్ర

అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ‘వెల్‌టవర్’ తన సీఈవో, భారతీయ మూలాలున్న శంఖ్ మిత్రకు గతేడాది ఏకంగా రూ. 7.7 వేల కోట్ల ప్యాకేజీని అందించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shankh Mitra Salary | ప్రతిభకు కార్పొరేట్ ప్రపంచం పట్టం కడుతోంది. భారీ వేతనాలతో సన్మానం చేస్తోంది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ‘వెల్‌టవర్’ కంపెనీ తన సీఈవో అయిన శంఖ్ మిత్రకు 2025 సంవత్సరానికిగాను 821 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 7,746 కోట్లు) వేతన ప్యాకేజీని అందించింది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు.

Shankh Mitra Salary | ఎవరీ శంఖ్ మిత్ర?

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కోల్‌కతా నగరానికి చెందిన శంఖ్ మిత్ర.. జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్‌లో అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఈ చదువే ఆయన ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కెరీర్‌కు బలమైన పునాది వేసింది. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్, సిటాడెల్, మిలీనియం మేనేజ్‌మెంట్ వంటి ప్రముఖ సంస్థల్లో సేవలందించారు. రియల్ ఎస్టేట్ సెక్యూరిటీలు, ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను సమర్థవంతంగా నిర్వహించి గుర్తింపు పొందారు.

Shankh Mitra Salary | 2016 నుంచి వెల్‌టవర్‌లో..

శంఖ్ మిత్ర 2016లో వెల్‌టవర్ సంస్థలో చేరారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, వైస్ చైర్మన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక పోస్టులను విజయవంతంగా నిర్వహించారు. 2020 అక్టోబర్‌లో కంపెనీ సీఈవోగా, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు.

Shankh Mitra Salary | షేర్ల రూపంలోనే..

శంఖ్ మిత్రకు లభించిన మొత్తం వేతనంలో సుమారు 99 శాతం స్టాక్ అవార్డుల రూపంలోనే ఉండడం గమనార్హం. 2025 అక్టోబర్‌లో కంపెనీ ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ప్రోత్సాహకంగా కేటాయించింది. ఆ షేర్ల విలువ 2025 చివరినాటికి బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన సీఈవోల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

ఇది కూడా చదవండి..: Venezuela Earthquake | వెనిజులా భూకంప బీభత్సం.. 920 మృతి.. వేలల్లో మిస్సింగ్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *