అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump Immigration Remarks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ఇతర దేశాల నుండి వస్తున్న వలసదారులపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “పేద దేశాల నుంచి ప్రజలు మన దగ్గరికి వస్తే, అమెరికా కూడా పేద దేశంగా మారిపోతుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతూనే, తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలనే లక్ష్యంతో ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్న ట్రంప్, తాజాగా తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వివాదాస్పద పోస్ట్ చేశారు.
Trump Immigration Remarks | ట్రంప్ ఏమన్నారంటే..
“దురదృష్టవశాత్తూ, మీరు థర్డ్ వరల్డ్ దేశాల నుండి ప్రజలను దిగుమతి చేసుకుంటే, అమెరికా కూడా త్వరలోనే థర్డ్ వరల్డ్ దేశంగా మారిపోతుంది. ఆ తర్వాత మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్!” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన ఉద్దేశించిన ‘థర్డ్ వరల్డ్’ దేశాలు ఏవనే దానిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trump Immigration Remarks | వలసలపై కఠిన వైఖరి..
అమెరికాకు వస్తున్న నైపుణ్యం లేని కార్మికుల వల్ల స్థానిక అమెరికన్ల ఉద్యోగాలకు పోటీ పెరగడమే కాకుండా, వేతనాలు తగ్గిపోతున్నాయని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన రెండో విడత పదవీ కాలంలో వలసలను అడ్డుకోవడానికి చట్టపరమైన, అక్రమ మార్గాల్లో కఠిన చర్యలు చేపడుతున్నారు.
Trump Immigration Remarks | హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పులు..
వలసలను నియంత్రించడంలో భాగంగా ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో సమూల మార్పులను ప్రతిపాదించింది. వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $100,000 (లక్ష డాలర్లు)కు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, ఉద్యోగి పొందే వేతనం , వారి నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేసే విధానాన్ని తీసుకురావాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. అయితే, ఈ ఫీజు పెంపును ఒక ఫెడరల్ జడ్జి అడ్డుకోవడంతో, ట్రంప్ ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DoJ) ద్వారా కోర్టులో అప్పీల్ చేసింది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి వల్ల అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న వలసదారుల్లో, ముఖ్యంగా ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి: Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో..