Bhatti Vikramarka Comments | హరీశ్‌రావువి పచ్చి అబద్ధాలు.. బీఆర్ఎస్ పాలనలో రూ. 8.21 లక్షల కోట్ల అప్పు: భట్టి విక్రమార్క

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhatti Vikramarka Comments | తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka )తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఇప్పుడు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క ప్రభుత్వం తరపున ఆర్థిక శ్వేతపత్రం తరహాలో కీలక వాస్తవాలను వెల్లడించారు.

Bhatti Vikramarka Comments | అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ పాలన..

“గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు, ఆ బాధ్యతను మరిచి సోషల్ మీడియా వేదికగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు” అని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన అంతా అబద్ధాల పునాదుల మీదే సాగిందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
batti.1

 

Bhatti Vikramarka Comments |లెక్కలతో సహా భట్టి వివరణ..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చేసిన అప్పు అక్షరాలా రూ. 8.21 లక్షల కోట్లు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని భట్టి సవాల్ విసిరారు. గత రెండున్నరేళ్లలో తాము అసలు , వడ్డీల రూపంలో రూ. 2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అత్యధిక వడ్డీలకు తెచ్చిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు తాము ‘రుణాల రీస్ట్రక్చరింగ్’ చేపట్టామని, దీనివల్ల సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ భారం రూ. 34 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లకు తగ్గిందని వివరించారు. ఇంతటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.

Bhatti Vikramarka Comments | సింగరేణిలో ‘బొగ్గు మాయం’..

సింగరేణి సంస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని భట్టి ఆరోపించారు. పదేళ్ల కాలంలో ఒక్క కొత్త బొగ్గు బ్లాక్‌ను కూడా అందుబాటులోకి తేని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సింగరేణి ప్రాంతాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌కు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించామని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన హెచ్చరించారు. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ సింగరేణిని, కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి:  Nagesh Reddy Warning | పీసీసీ చీఫ్​పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *