అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Road Accident | రోడ్డు ప్రమాదం (Road Accident)లో మహిళ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తరలించడంతో పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ (Hyderabad) శేరిలింగంపల్లి పరిధిలోని మదినగూడలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో మహిళ చనిపోయింది. అయితే ఆమె మృతదేహం 35 నిమిషాల పాటు నడిరోడ్డుపైనే ఉంది. ఆ తర్వాత అంబులెన్స్‌లో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని అలా రోడ్డుపై ఉంచడంపై స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Road Accident | ఎదురెదురుగా ఢీకొన్నకార్లు
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మంచాల మండలం ఆగపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చదవండి..: Jupally Krishna Rao | గంజాయి రవాణాపై కఠిన చర్యలు : మంత్రి జూపల్లి
