అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pulse Polio | పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. పట్టణంలో కొనసాగుతున్న పల్స్ పోలియో(Polio Campaign) కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.
Pulse Polio | అంగన్వాడీలో..
పట్టణంలోని (Yellareddy) అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా చుక్కల మందు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజం నిర్మించేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతోందన్నారు. దేశంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మందు వేసుకోకుండా ఉండవద్దని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకెళ్లాలని కోరారు. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Tribal University Convocation | వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము