Pulse Polio Campaign | జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం

కామారెడ్డి జిల్లాలో జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఆదివారం చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pulse Polio Campaign | కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఆదివారం చేపట్టారు. జిల్లాలోని ఐదేళ్లలోపు 1,03,678 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్​ లక్ష్యంగా నిర్ణయించినట్లు డీఎంహెచ్ వో వెంకట్​ తెలిపారు.

Pulse Polio Campaign | 3 రోజుల కార్యాచరణ..

జిల్లావ్యాప్తంగా పల్స్​ పోలియోకు మూడురోజుల కార్యాచరణ రూపొందించారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బూత్​లలో పోలియో డ్రాప్స్​ వేసే కార్యక్రమం చేపట్టారు.  ప్రజలకు అందుబాటులో ఉండేలా బూత్‌లను ఏర్పాటు చేశారు. హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్‌లు కవర్ చేస్తాయి. బస్​స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో ట్రాన్సిట్ టీమ్‌లు బూత్‌లు ఏర్పాటు చేశాయి. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని వారి కోసం మంగళ, బుధవారాల్లో ఇంటింటికీ వెళ్లి వేయనున్నారు.

Pulse Polio Campaign

Pulse Polio Campaign | జిల్లాలో ఇమ్యూనైజేషన్​ వివరాలు..

జిల్లా మొత్తం జనాభా 10,79,796 ఉండగా.. ఐదేళ్లలోపు చిన్నారులు 1,03,678 మంది ఉన్నారు. అలాగే మొత్తం ఇళ్లు 2,14,165 ఉన్నాయి. ఇందులో భాగంగా 733 బూత్​లను ఏర్పాటు చేశారు. 20 పీహెచ్​సీలు ఉండగా.. రెండు యూపీహెచ్​సీలు ఉన్నాయి. అలాగే 28 కోల్డ్​ చెయిన పాయింట్లు, 74మంది సూపర్​వైజర్లు, 22 మొబైల్​ టీంలు, 174 హైరిస్క్​ పాయింట్లు ఉన్నాయి. మొత్తంగా 1,31,974 డోస్​లను చిన్నారుల కోసం సిద్ధంగా ఉంచారు. వీటిని వేసేందుకు 2,552మంది ఆశా, ఏఎన్​ఎం, ఏడబ్ల్యూ,డబ్ల్యూ వలంటీర్లు పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని అర్హులైన వయసు పిల్లలందరికీ bOPV వ్యాక్సిన్ వేయడమే ఈ కార్యక్రమం తుది లక్ష్యమని డీఎంహెచ్​వో తెలిపారు.

ఇది కూడా చదవండి..: Bodhan Chain Snatching | చైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *