US Iran Airstrikes | 10 ఇరాన్ స్థావరాలపై దాడులు.. ఫుటేజ్‌ విడుదల చేసిన అమెరికా..

అమెరికా – ఇరాన్​ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. ఉద్రిక్తతలు చల్లారడంలేదు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Iran Airstrikes | అమెరికా – ఇరాన్​ మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. ఉద్రిక్తతలు చల్లారడంలేదు. హర్మూజ్​ జలసంధి (Strait of Hormuz)లో ఓ కంటెయినర్​ నౌకపై​ ఇరాన్​ డ్రోన్​ జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్​పై దాడులకు దిగింది. రెండో రోజు కూడా 10 స్థావరాలపై దాడులకు పాల్పడింది.

US Iran Airstrikes | ఇరాన్​ డ్రోన్​ దాడికి ప్రతీకారంగా..

మూడు నాలుగు రోజుల క్రితం కంటైనర్ నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా, హర్మూజ్ జలసంధిలో, దాని సమీపంలోని పలు ప్రదేశాల్లో 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా వైమానిక, నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా దళాలు మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నాయి.

US Iran Airstrikes | నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచన

ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన జలమార్గాల్లో ఒకటిగా పరిగణించబడే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ప్రపంచ ముడి చమురులో దాదాపు ఐదో వంతు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది.

US Iran Airstrikes | ఇరాన్​ తీరుపై ట్రంప్​ ఆగ్రహం

రవాణా నౌకపై ఇరాన్​ దాడి చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. మూడు నెలల క్రితం “చాలా విజయవంతంగా” ప్రారంభించిన తన పనిని అమెరికా మరోసారి “సైనికంగా పూర్తి” చేయవలసి వస్తే, ఇరాన్ “ఇకపై ఉనికిలో ఉండదు” అని ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Venezuela Earthquake Miracle | మృత్యుంజయురాలు.. వెనెజువెలా శిథిలాలలో బయటపడ్డ 18 రోజుల పసికందు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *