అక్షరటుడే వెబ్డెస్క్: Venezuela Earthquake Miracle | వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విపత్తులో ఓ 18 రోజుల పసికందు తన తల్లితో కలిసి శిథిలాల కింద చిక్కుకుంది.
Venezuela Earthquake Miracle | తండ్రి వేదన..
తన భార్య, పసిబిడ్డ శిథిలాల కింద ఉండటంతో ఆ కన్నతండ్రి పడిన వేదన వర్ణనాతీతం. రెస్క్యూ సిబ్బంది సహాయంతో శిథిలాలను తొలగిస్తుంటే, ఆ తండ్రి ప్రాణం గొంతులోనే బిగుసుకుపోయింది. గంటల తరబడి శ్రమించిన తర్వాత, ఎట్టకేలకు ఆ 18 రోజుల బిడ్డ ప్రాణాలతో కనిపించింది. ఎలాంటి గాయాలు లేకుండా, ఆరోగ్యంగా ఉన్న బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారిని తండ్రికి అందించినప్పుడు అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు.
Venezuela Earthquake Miracle | మరో అద్భుతం..
బిడ్డ దొరికిన 90 నిమిషాల తర్వాత, శిథిలాల కింద చిక్కుకున్న తల్లిని కూడా రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. భార్యాబిడ్డలిద్దరూ సజీవంగా బయటపడటంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఈ ఘటన వెనెజువెలా విపత్తులో ఒక అద్భుతంగా నిలిచింది.
Venezuela Earthquake Miracle | భారీ నష్టం..
ఈ జంట భూకంపాల వల్ల సుమారు రూ. 63 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒకవైపు ప్రాణనష్టం, మరోవైపు భారీ ఆస్తి నష్టంతో వెనెజువెలా అతలాకుతలమవుతోంది. అయితే, ఇటువంటి అద్భుతాలు మాత్రం విపత్తులో చిక్కుకున్న ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ కుటుంబం క్షేమంగా బయటపడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెనిజులా భూకంపం.. మరణాన్ని జయించిన రోజుల చిన్నారి
వెనిజులాను భూకంపం అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అనేక భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నారు. కాగా.. బాధితులను రక్షించేందకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 48 గంటల తర్వాత 18 రోజుల చిన్నారి… pic.twitter.com/8Vj2zGRlBQ
— Akshara Today | Telugu News (@aksharatoday) June 27, 2026
ఇది కూడా చదవండి: Student Welfare Facilities | విద్యార్థులకు సౌకర్యాలు అందేలా పర్యవేక్షించాలి: ప్రత్యేక అధికారిణి విజయేంద్ర