అక్షరటుడే వెబ్డెస్క్: Voter List Suicide | కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో తన పేరు లేదని, దానివల్ల ప్రభుత్వం తనను జైలుకు పంపిస్తుందేమోనని భయపడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని బోరబండ ప్రాంతంలో వెలుగుచూసింది.
Voter List Suicide | పేరు తప్పుగా ఉండటంతో..
బోరబండలోని భరత్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ముజీబుర్ రహ్మన్ (51) కార్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా తన పాస్పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలో పేరు తప్పుగా ఉండటంతో, వాటిని సరిచేయించుకోవడానికి ముజీబుర్ లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఈ క్రమంలో, తాజా ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడం, తన దగ్గర ఉన్న పత్రాలు ఆ జాబితాతో సరిపోలకపోవడం చూసి ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Voter List Suicide | మనస్తాపంతోనే..
“జాబితాలో పేరు లేకపోతే అధికారులు తనను జైలుకు పంపిస్తారని, అప్పుడు నా పిల్లల గతి ఏంటి?” అని ఆయన నిత్యం తన భార్యతో బాధపడేవారని , ఎంత ధైర్యం చెప్పినా, జైలుకు వెళ్తాననే భయం ముజీబుర్ను వెంటాడిందని కుటుంబ సభ్యులు తెలిపారు . ఈ తీవ్ర మనస్తాపంతోనే చివరకు ఇంటి బయట ఉన్న షెడ్డులోని ఇనుప రాడ్డుకు ఉరేసుకుని ఆయన ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు .
Voter List Suicide | దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఆందోళన చెందినట్లుగా నిజంగానే ఓటరు జాబితాలో ఆయన పేరు లేదా? అసలు ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
#Hyderabad cab driver allegedly dies by suicide, with his family claiming distress over the ongoing #SpecialIntensiveRevision of electoral rolls and fears that removal of his name from the voter list would affect the family’s welfare benefits. https://t.co/tIfDevjrWI
— National Herald (@NH_India) June 29, 2026
ఇది కూడా చదవండి: Home Birth Tragedy | యూట్యూబ్ చూసి ఇంట్లోనే ప్రసవం.. నిండు ప్రాణం బలి