Child Rape Case | బాలికపై అత్యాచారం కేసులో వృద్ధుడికి జీవిత ఖైదు

12వ అదనపు సెషన్స్‌ కోర్టు నిందితుడికి రూ.2 లక్షల జరిమానా కూడా విధించినట్లు గోల్కొండ పోలీసులు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Child Rape Case | నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. హైదరాబాద్​ Hyderabad నాంపల్లిలోని 12వ అదనపు సెషన్స్‌ కోర్టు నిందితుడికి రూ.2 లక్షల జరిమానా కూడా విధించినట్లు గోల్కొండ పోలీసులు తెలిపారు.

Child Rape Case | ఆడుకుంటున్న సమయంలో కన్నేసి..

పోలీసుల వివరాల ప్రకారం.. నాలుగేళ్ల బాలిక ఇంటి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటున్న సమయంలో నారాయణ తాతా (76) ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనను అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు గమనించి నిందితుడిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Hyderabad Police Reorganization | హైదరాబాద్ పోలీస్ పరిధి పునర్వ్యవస్థీకరణ..76 ప్రాంతాల్లో మార్పులు!

ఘటనపై బాలిక తల్లి గత ఏడాది జూన్‌ 28న గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. విచారణ అనంతరం నాంపల్లి 12వ అదనపు సెషన్స్‌ జడ్జి అర్చనకుమారి నిందితుడికి జీవిత ఖైదు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *