అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Miyapur Doctor Murder | ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అంతేగాకుండా పీజీ చదువుతూ పిడీయాట్రిషన్గా పని చేస్తోంది. ఆ డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన క్యాబ్ డ్రైవర్‌తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆమె నుంచి తీసుకున్న బంగారు గొలుసు కోసం అతడు ఏకంగా ప్రాణాలు తీశాడు. ఈ విషాదకర ఘటన మియాపూర్‌లో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) శాంతినగర్‌కు చెందిన కోటమి సృజన మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం హన్మకొండలో పీజీ చదువుతోంది. తన స్నేహితులతో కలిసి ఉంటూ, ఒక ఆసుపత్రిలో పిల్లల వైద్యురాలిగా కూడా పనిచేస్తోంది. ఎంబీబీఎస్ చదివే సమయంలో ఆమెకు మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన క్యాబ్ డ్రైవర్ రవి కుమార్ (30)తో పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది.
Miyapur Doctor Murder | బంగారు ఆభరణాల కోసం..
రవికుమార్‌కు బయట అప్పులు కావడంతో వాటిని తీర్చడానికి సృజన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. వాటితో అప్పులు తీర్చాడు. అయితే మళ్లీ బంగారు ఆభరణాలు ఇవ్వాలని సృజన అడిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 29న రవికుమార్ మియాపూర్‌కు వచ్చి ఓ హోటల్లో దిగాడు. అనంతరం సృజనకు ఫోన్ చేసి బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పాడు. దీంతో ఆమె హన్మకొండ నుంచి సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చింది. హోటల్‌కు వచ్చిన తర్వాత రవికుమార్ తన ప్రియురాలిని హత్య చేశాడు. అనంతరం గదికి తాళం వేసి వెళ్లిపోయాడు.
Miyapur Doctor Murder | ఫోన్ లేపకపోవడంతో..
బంగారు ఆభరణాల కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు సృజన స్నేహితులకు చెప్పింది. తర్వాత ఆమెకు వారు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన వారు ఆమె తండ్రికి సమాచారం అందించారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మియాపూర్‌కు చేరుకొని హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆమె విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Child Rape Case | బాలికపై అత్యాచారం కేసులో వృద్ధుడికి జీవిత ఖైదు