Cannabis Smuggling | పనసపండ్ల చాటున గంజాయి రవాణా.. ముగ్గురిపై పీడీయాక్ట్​..

గంజాయి అక్రమ రవాణాపై కామారెడ్డి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Cannabis Smuggling | గంజాయి అక్రమ రవాణాపై కామారెడ్డి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిపై పీడీయాక్ట్​ నమోదు చేశారు.

Cannabis Smuggling | పనసపండ్ల చాటున గంజాయి..

పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయి తరలిస్తున్న కేసులో మరో ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్న వారి సంఖ్య ఏడుకు చేరింది. గత జూన్ 20న ఒడిశా నుంచి మహారాష్ట్రలోని నాసిక్​కు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాలతో పోలీసులు జాతీయ రహదారి 44పై తనిఖీలు చేపట్టారు. క్యాసంపల్లి శివారులోని రాయల్ దాబా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా పనసపండ్ల కింద సంచుల్లో దాచిన 387 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1,93,56,400గా తేలింది.

Cannabis Smuggling | ఇందల్వాయి మండలం తిర్మన్​పల్లి..

తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేసిన వారిని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన షేక్ కరీముల్లా అలియాస్ షేక్ కరీం, గైని సుభాష్, షేక్ రహీమ్​లుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లాలో డ్రగ్స్ అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, వాహన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు.

ఇది కూడా చదవండి..: PETA President Election | పెటా అధ్యక్షుడిగా డాక్టర్​ అబ్బాపూర్​ రవీందర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *