Sri City Pharma Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్​.. ఐదుగురి మృతి

తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sri City Pharma Blast | తిరుపతి జిల్లా (Tirupati District)లోని శ్రీ సిటీ సమీపంలో ఉన్న టీఐఎల్ హెల్త్‌కేర్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.

సత్యవేడు మండలం శ్రీ సిటీలోని ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. ఫ్యాక్టరీలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. రాత్రి విధుల్లో ఉన్న పలువురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్​ల్లో ఆస్పత్రికి తరలించారు.

Sri City Pharma Blast | మంత్రి లోకేశ్​ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ఏపీ మంత్రి నారాలోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Bhanu Prakash Reddy | బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియాతో భాను ప్రకాష్ రెడ్డి భేటీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *