అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Pakistan Final | ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా పసిడి పతకం కోసం భారత క్రికెట్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైనల్లో తలపడుతోంది. కరోగి స్పోర్ట్స్ పార్కులో జరిగిన మ్యాచ్‌లో భారత్ 211 పరుగులు చేసింది.
సెమీస్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ రెండు సిక్కులతో ఊపు మీద కనిపించాడు. అయితే 15 పరుగులకే అతడు ఔట్ అయ్యాడు. అనంతరం అభిషేక్ శర్మ చెలరేగాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి.
India Pakistan Final | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ
ఫస్ట్ డౌన్లో వచ్చిన సంజు శాంసన్ 2 పరుగులకే ఔట్ అయ్యాడు. 93 పరుగుల వద్ద అభిషేక్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం భారత స్కోర్ వేగం నెమ్మదించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ 20 నిలకడగా ఆడారు. అయితే వెంటవెంటనే వారు ఇద్దరు ఔట్ అయ్యారు. 14.1 ఓవర్లకు భారత్ 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అనంతరం శివమ్ దూబే (27), తిలక్ వర్మ (51) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తిలక్ వర్మ 20 బంతుల్లో హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 211 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆసియా క్రీడల్లో భారత్ గోల్డ్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే భారత మహిళల జట్టు పసిడి సాధించింది.
ఇది కూడా చదవండి..: Pranavi Urs Gold Medal | గోల్ఫ్‌లో పసిడి సాధించిన ప్రణవి.. ఆర్చరీలో మరో బంగారు పతకం