Chennai Playoff Equations | చెన్నై ప్లే ఆఫ్ ఆశ‌ల‌కు గండి కొట్టిన ల‌క్నో.. మారిన స‌మీక‌ర‌ణాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chennai Playoff Equations | ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings)పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సీఎస్కే నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ ఫలితంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. లక్నో విజయానికి ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) ప్రధాన కారణంగా నిలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మార్ష్ కేవలం 38 బంతుల్లో 90 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో రనౌట్ కావడంతో ఈ సీజన్‌లో మరో శతకం నమోదు చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

Chennai Playoff Equations | క్లిషంగా మారిన అవ‌కాశాలు..

మార్ష్‌కు తోడుగా ఇంగ్లిష్‌ 36 పరుగులతో విలువైన సహకారం అందించాడు. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి చెరో వికెట్ తీసుకున్నప్పటికీ లక్నో దూకుడును అడ్డుకోలేకపోయారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. యువ బ్యాటర్ కార్తీక్ శ‌ర్మ‌ 42 బంతుల్లో 71 పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. ప్రారంభంలో సంజు శాంసన్ 20 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 9 పరుగులకే ఔటైనా, కార్తీక్ శర్మ–బ్రెవిస్ జోడీ నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో శివమ్ దూబే 16 బంతుల్లో 32 పరుగులతో వేగం పెంచాడు.

Chennai Playoff Equations | 12 పాయింట్లతో..

లక్నో బౌలర్లలో ఆకాష్ మహరాజ్ సింగ్ మూడు వికెట్లు తీసి సీఎస్కేను నియంత్రించాడు.ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ సమీకరణాలు కఠినంగా మారాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్ల వద్ద ఉన్న చెన్నై, మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి సీఎస్కే ముందు నిలిచింది.అయితే పంజాబ్, హైదరాబాద్ జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాలని చెన్నై కోరుకోవాలి. ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్ జట్లు 16 పాయింట్లతో ముందంజలో ఉండటంతో సీఎస్కేకు దారులు చాలా క‌ష్టంగా మారాయి.

ఇది కూడా చదవండి..: Hardik Pandya Auction | హార్దిక్ కోసం ఐపీఎల్ జట్ల మధ్య పోటీ?.. మెగా వేలంలో కోట్ల వర్షం ఖాయమే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *