క్రీడలుIPL 2026 Final | ఆర్సీబీ ఖాతాలో రెండో టైటిల్.. ఐపీఎల్ ఫైనల్​లో గుజరాత్​పై గ్రాండ్​...

IPL 2026 Final | ఆర్సీబీ ఖాతాలో రెండో టైటిల్.. ఐపీఎల్ ఫైనల్​లో గుజరాత్​పై గ్రాండ్​ విక్టరీ!

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. జీటీ విధించిన లక్ష్యాన్ని ఆర్​సీబీ అవలీలగా ఛేదించి ఐపీఎల్​ 19వ సీజన్​ టైటిల్​ను సొంతం చేసుకుంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2026 Final  | ఐపీఎల్​ (2026) 19వ సీజన్​ టైటిల్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 31న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన తుదిపోరులో ఆర్​సీబీ విజయం సాధించింది.

RCB Thriller Victory

IPL 2026 Final | 19వ సీజన్​ Title

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్లు 2025లో తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు. తాజా గెలుపుతో వారి ఖాతాలో రెండో టైటిల్ కూడా చేరింది. ఐపీఎల్​ ప్రారంభం అయ్యాక ఇది 19వ సీజన్​ కావడం గమనార్హం. అంటే 19వ సీజన్​ టైటిల్​ ఆర్సీబీ ఖాతాలో చేరింది.

టాస్ గెలిచిన RCB తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు బౌలర్ రసిఖ్ సలామ్ దార్ (3/27) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ (50*) ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.

IPL 2026 Final | కింగ్ కోహ్లీ వీరవిహారం.. రసిఖ్ సలామ్ మ్యాజిక్

అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రన్ ఛేజింగ్‌లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, మొత్తంగా 75 (42 బంతులు; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రాషిద్ ఖాన్ 2 వికెట్లు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది.

akshara today .jpgkohli

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

 

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...