India vs Pakistan Women Asia Cup | భారత్​ అమ్మాయిల దాటికి పాక్​ చిత్తు.. 7 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ!

శ్రీచరణి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ప్రేమ రావత్ 9 పరుగులకు 3 వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచింది. దీప్తి శర్మ 2 వికెట్లు, షెఫాలీ వర్మ 1 వికెట్ తీశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: India vs Pakistan Women Asia Cup | మహిళల ఆసియా కప్‌ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సర్వాంగీణ ఆధిక్యాన్ని ప్రదర్శించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం (హ్యాట్రిక్) కావడం విశేషం.

India vs Pakistan Women Asia Cup | స్పిన్ ధాటికి పాక్ పతనం..55 పరుగులకే ఆలౌట్

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా భారత స్పిన్ దళం ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

శ్రీచరణి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ప్రేమ రావత్ 9 పరుగులకు 3 వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచింది. దీప్తి శర్మ 2 వికెట్లు, షెఫాలీ వర్మ 1 వికెట్ తీశారు.

India vs Pakistan Women Asia Cup | రికార్డు స్థాయిలో అత్యల్ప స్కోరు

భారత బౌలర్ల దాటికి పాకిస్థాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఆ జట్టులో మునీబా అలీ (13), షవాల్ జుల్ఫికర్ (14) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు.

Lionel Messi Retirement | ఒక శకం ముగిసింది: అంతర్జాతీయ ఫుట్​బాల్‌కి లియోనెల్ మెస్సీ గుడ్​బై

India vs Pakistan Women Asia Cup | లక్ష్య ఛేదనలో హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపులు

56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలో స్వల్ప వికెట్ల నష్టం జరిగింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9)తో పాటు ప్రతీకా రావల్ (4) త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ 35 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది.

అయితే, స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. సమయోచితంగా బౌండరీలు బాదుతూ కేవలం 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *