India vs West Indies | వెస్టిండిస్​తో మ్యాచ్​.. విద్యార్థులకు ఉచిత టికెట్లు

ఉప్పల్​లో ఈ నెల 14న టీ 20 మ్యాచ్​ సందర్భంగా 2500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత టికెట్లు ఇవ్వనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs West Indies | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఉప్పల్​ స్టేడియంలో ఈ నెల 14న భారత్​–వెస్టిండీస్ నాలుగో టీ 20 మ్యాచ్​ జరగనుంది. మూడో టీ 20 రేపు ఇండోర్​లో నిర్వహించనున్నారు.

ఉప్పల్​లో మ్యాచ్​ కోసం హెచ్​సీఏ ఏర్పాట్లు చేసింది. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఆర్మీ సిబ్బందికి 2,750 ఉచిత టిక్కెట్లను అందిస్తామని తెలిపింది. విద్యార్థులకు 2,500 టిక్కెట్లు, ఆర్మీ సిబ్బందికి 250 టిక్కెట్లు ఉచితంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్​ కోసం మొత్తం 34 వేల టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్లను ఆన్​లైన్​లో విక్రయించారు. టికెట్ ధర రూ.750 నుంచి ప్రారంభం అవుతుంది.

India vs West Indies | పార్కింగ్​ కష్టాలకు చెక్​

ఉప్పల్ స్టేడియంలో పార్కింగ్​ కష్టాలకు హెచ్​సీఏ చెక్​ పెట్టింది. మ్యాచ్​ చూడటానికి వచ్చే వారి కోసం పార్కింగ్​ సామర్థ్యాన్ని పెంచింది. దీంతో 4500 కార్లు ఇప్పుడు పార్క్​ చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరగనున్న T20 మ్యాచ్‌ కోసం కొత్త పిచ్​ను సైతం సిద్ధం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 15 ఏళ్ల తర్వాత కొత్త పిచ్​ ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Kisan Cricket League | గ్రామీణ ప్రతిభకు పెద్దపీట.. ప్రసార భారతితో కలిసి ‘కిసాన్ క్రికెట్ లీగ్’ గ్రాండ్ లాంచ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *