అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal Bathukamma Celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది. దీనిని పురస్కరించుకుని జుక్కల్ (Jukkal)లో ఎల్‌కేఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు–2026 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న ఈ వేడుకలు జరుగనున్నాయి.
Jukkal Bathukamma Celebrations | విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు
బతుకమ్మ సంబరాల్లో భాగంగా నిర్వహించే పోటీల్లో విజేతలకు భారీ నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతిగా రూ.51 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.11 వేల నగదును ప్రకటించారు. వీటితోపాటు మరో ఎనిమిది మందికి ప్రత్యేక బహుమతులు అందించనున్నారు.
Jukkal Bathukamma Celebrations | తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయ పండుగైన బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పేలా, పూల పండుగ విశిష్టతను ప్రతిబింబించే విధంగా వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను అందంగా అలంకరించి సంబరాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈనెల 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జుక్కల్‌లోని గుండూరు రోడ్డులో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌తో పాటు టీమ్ ఎల్‌కేఆర్ నిర్వాహకులు మహిళలు, యువతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Kamareddy District | పదేళ్ల కామారెడ్డి.. జిల్లా కేంద్రం అయినా మారని పరిస్థితి