Police Promotions | పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయి..: సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Police Promotions | పోలీస్​శాఖలో పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురు కానిస్టేబుళ్లు హెడ్​ కానిస్టేబుళ్లుగా పదోన్నతి రాగా వారిని సీపీ కార్యాలయం (CP Office)లో అభినందించారు.

Police Promotions | బాధ్యతగా విధులు నిర్వర్తించాలి..

ఈ సందర్భంగా నలుగురు కానిస్టేబుళ్లకు సీపీ బ్యాడ్జ్​లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశాల ప్రకారం..వారికి పదోన్నతులు లభించాయన్నారు. ప్రమోషన్​ తర్వాత మరింత నిక్కచ్చిగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. వర్ని పోలీస్​స్టేషన్​ కానిస్టేబుల్​ కె.ఆనంద్, 2వ టౌన్​ పోలీస్ స్టేష,న్​లో సతీష్, ధర్పల్లి పోలీస్​స్టేషన్​లో కె.నవీన్ కుమార్, వన్​టౌన్​లో శశిప్రసాద్​లు హెడ్​కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు.

Police Promotions

ఇది కూడా చదవండి..: Women Reservation | మహిళా రిజర్వేషన్​కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *