Women Reservation | మహిళా రిజర్వేషన్​కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Women Reservation | మహిళా రిజర్వేషన్​పై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని.. డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి అన్నారు. తమ పార్టీ మహిళా రిజర్వేషన్​కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్​ భవన్​లో (Congress Bhavan) విలేకరుల సమావేశం నిర్వహించారు.

Women Reservation | రిజర్వేషన్లకు ఎప్పుడు వ్యతిరేకం కాదు..

ఈ సందర్భంగా నగేష్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మహిళా రిజర్వేషన్లకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. 2023లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపిందని, బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంట్​ స్థానాల్లో మహిళ రిజర్వేషన్​ను అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

Women Reservation

Women Reservation | నియోజకవర్గాల పునర్విభజన ద్వారా..

గ్రామీణ స్థాయిలో సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని నగేష్​రెడ్డి అన్నారు. గతంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వ్యతిరేకించిందని, సోనియా గాంధీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఆలోచనతో ఎప్పటినుంచో ఈ బిల్లును ముందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. 2023లో మహిళ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలిపిందని.. కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ పేరుతో కుట్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్,  జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కౌడపు శరత్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేంద్ర గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్ ,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Naikapod Population | నాయక​పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరికాదు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *