Jukkal Auditorium Renovation | ఆడిటోరియం పునరుద్ధరణకు చర్యలు: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Jukkal Auditorium Renovation | జుక్కల్ మండల (Jukkal Mandal) కేంద్రంలోని ఆడిటోరియంను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంగళవారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Jukkal Auditorium Renovation

ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆడిటోరియంను తీర్చిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో అంచనాలు రూపొందించి నిధులు మంజూరు చేయిస్తామన్నారు.

Jukkal Auditorium Renovation | ఉపాధి హామీ కార్మికులతో..

Jukkal Auditorium Renovation

ఉపాధి హామీ కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ పథకం ప్రారంభమై 20 సంవత్సరాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఉపాధి హామీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే (MLA Thota Lakshmikantharao) స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Development | అభివృద్ధి పథంలో తెలంగాణ : సుదర్శన్​రెడ్డి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *