Telangana Police Sports | పోలీస్​స్పోర్ట్స్​ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సాయి చైతన్య

5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకలు నిజామాబాద్​ జిల్లాలో జరుగనున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Telangana Police Sports | 5వ తెలంగాణ(Telangana) రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు వేడుకలు నిజామాబాద్​ జిల్లాలో జరుగనున్నాయి. ఈ మేరకు జానకంపేట్​లో ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం పరిశీలించారు.

Telangana Police Sports | క్రీడాకారులకు ఇబ్బందుల్లేకుండా..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్​మీట్​కు వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జానకంపేటలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పరేడ్ గ్రౌండ్, ప్రధాన వేదిక, అతిథుల గ్యాలరీ, క్రీడాకారులు, పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ మల్లేష్, బోధన్ రూరల్ సీఐ విజయ్​బాబు, రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ ధరణి, ఎంటీవో శేఖర్ బాబు, ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ వినోద్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అవినీతిలో…లీడర్లను మించిపోతున్న ఆఫీసర్లు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *