Police Martyrs Remembrance | 21వ తేదీనుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

కామారెడ్డి జిల్లాలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Police Martyrs Remembrance | దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాలో (Kamareddy) అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

Police Martyrs Remembrance | ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు

ఈనెల 21 నుంచి 31వ వరకు సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రాజేష్​ చంద్ర తెలిపారు. 21న జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు విద్యార్థులు, యువతలో పోలీసు శాఖ సేవలు, విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేలా అక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, పోలీస్ అమరవీరుల కుటుంబాల పరామర్శ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

Police Martyrs Remembrance | పోలీసు సిబ్బందికి పోటీలు..

పోలీసుల విధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజల భద్రతలో పోలీసుల పాత్రను ప్రజలకు వివరించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసు అధికారులకు వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్​ వరకు చదువుతున్న విద్యార్థులకు – సైబర్ నేరాల నివారణలో పోలీసుల, పౌరుల పాత్ర, మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల పాత్ర అనే అంశాలపై ఉంటాయన్నారు. అలాగే డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు – సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర, తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర అనే అంశాలపై పోటీలు నిర్వహించనున్నారు.

Police Martyrs Remembrance | కానిస్టేబుల్​ నుంచి..

కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకు, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు వేర్వేరు అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. పోలీసుల ప్రజాసేవలు, రహదారి భద్రత, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై మూడు ఛాయాచిత్రాలు (10×8 అంగుళాలు), మూడు నిమిషాలకు మించని లఘు చిత్రాలను రూపొందించి పెన్ డ్రైవ్​లో సమర్పించాలని సూచించారు. పోటీల్లో పాల్గొనేవారు తమ ఎంట్రీలను అక్టోబర్ 24వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ విభాగంలో రవి కుమార్ (9963308978, 8712526113)కు అందజేయాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో కొండా వర్గం హల్​చల్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *