అక్షరటుడే, కోటగిరి: Hangarga Panchayat Secretary | అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జీపీ కార్యదర్శిని గ్రామస్తులు నిర్బంధించారు. ఈ ఘటన పోతంగల్ (Potangal) మండలంలోని హంగర్గా గ్రామంలో మంగళవారం జరిగింది.
Hangarga Panchayat Secretary | రూ.5 లక్షల గోల్మాల్
గ్రామస్తులు మాట్లాడుతూ.. జీపీ తీర్మానాలను పట్టించుకోకుండా కార్యదర్శి కొందరి వద్ద డబ్బులు తీసుకుని ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే గ్రామపంచాయతీ (Panchayat) నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఆగ్రహించిన ప్రజలు మంగళవారం జీపీ కార్యదర్శిని నిర్బంధించారు. సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ.. పది నెలల జమాఖర్చుల విషయంలో గ్రామసభలో పొంతన లేకుండా ఖర్చులు చూపించారన్నారు. అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు.
రూ.5లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు తమకు అనుమానం ఉందన్నారు. ఇల్లు లేని వారికి, ఖాళీ స్థలాలు ఉన్నవారికి, పేరు మార్పిడి కోసం వస్తే వారి వద్ద డబ్బులు తీసుకుంటూ జీపీకి నష్టం చేకూర్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలల నుండి సుమారు రూ.40వేల నుండి రూ.50వేల వరకు బ్యాంకులో జమల చేయకుండా వాడుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. రసీదు పుస్తకంలో రసీదులను మధ్య, మధ్యలో చింపుతూ.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు అతన్ని వదిలేది లేదని గ్రామస్తులు జీపీకి తాళం వేసి పంచాయతీ ముందు బైఠాయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: 20న ఆది సాయికుమార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్