అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Madhavnagar ROB Approvals | కాంగ్రెస్ నాయకుల కృషితోనే మాధవ్నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు వచ్చాయని డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
Madhavnagar ROB Approvals | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (Madhavnagar Railway Overbridge) నిర్మాణానికి 101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. డిచ్పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందున్నారు. గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ నిర్ణయించడంతో నిధుల అనుమతులకు మార్గం సుగమమైందన్నారు.
Madhavnagar ROB Approvals | పీసీసీ చీఫ్,ప్రభుత్వ సలహాదారు..
ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్లుగా అదనపు నిధుల మంజూరు, సవరించిన అంచనాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులు పెండింగ్లో ఉన్నాయని రామకృష్ణ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆర్వోబీ పనులపై చర్చించి నిర్మాణ పనులను వేగం చేసేందుకు పూనుకుందన్నారు. కాని ఏమీ చేతకాని ఎంపీ అర్వింద్ తానే ఏదో చేసి నిధులు రప్పించానని చెప్పటం ఎలా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డే అన్నట్టుందని ఎద్దేవా చేశారు. ఎంపీ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి..: Model School Jobs | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం