అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Unauthorized Clinics Nizamabad | జిల్లావ్యాప్తంగా అనుమతుల్లేని క్లినిక్‌లు, ఆస్పత్రులపై వైద్యశాఖ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి తాళం వేస్తోంది.
Unauthorized Clinics Nizamabad | నగరంలోని ఖలీల్వాడిలో..
నగరం (Nizamabad)లోని ఖలీల్వాడిలో శనివారం డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆధ్వర్యంలో వైద్యాధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్, క్లినిక్, ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఖలీల్వాడీలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్లినిక్‌లో తనిఖీ చేసిన అధికారులు నిబంధనలుకు విరుద్ధంగా నిర్వహిస్తుండడంతో తాళం వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులేని ఆస్పత్రులు, క్లినిక్‌లలో వైద్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటిని మూసివేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Tirumala Temple | శ్రీవారి కొండకు పోటెత్తిన భక్తజనం..పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం