Telangana Tirumala Temple | శ్రీవారి కొండకు పోటెత్తిన భక్తజనం..పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం

గోవిందా.. గోవిందా.. నామస్మరణలతో బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం మారుమోగింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Telangana Tirumala Temple | గోవిందా.. గోవిందా.. నామస్మరణలతో బీర్కూర్‌ (Birkur) మండలం తిమ్మాపూర్‌ శివారులోని (Thimmapur Temple) తెలంగాణ తిరుమల దేవస్థానం మారుమోగింది. శ్రావణ మాసం శనివారం కావడంతో ఉమ్మడి నిజామాబాద్‌(Nizamabad) జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు.

Telangana Tirumala Temple | భక్తజన సంద్రంగా ఆలయం..

దీంతో శ్రీవారి కొండ భక్తజన సంద్రంగా మారింది. ఈ సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. శ్రావణ మాసం శనివారం శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి కొండ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

అలాగే కొండ దిగువ నుంచి ఆలయం వరకు దేవస్థానానికి చెందిన వాహనాల ద్వారా భక్తులను తరలించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, తిమ్మాపూర్‌ గ్రామ సర్పంచ్‌ అప్పారావు, బీర్కూర్‌ తండా సర్పంచ్‌ దేవిసింగ్‌, నరసరాజు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : ChatGPT for Teens | ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం. టీనేజర్ల కోసం అద్భుత ఫీచర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *