Bear Attack | పులి కాదు.. దాడి చేసింది ఎలుగుబంటే..: డీఎఫ్​వో నిఖిత

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bear Attack | కట్టెలు తేవడానికి వెళ్లిన వ్యక్తిపై దాడి చేసింది పెద్దపులి, చిరుతపులి కాదని.. ఎలుగుబంటేనని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత (DFO Nikitha) స్పష్టం చేశారు. పులి అంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వదంతులను నమ్మవద్దని కోరారు.

Bear Attack | రాత్రిళ్లు.. తెల్లవారుజామున అడవులకు వెళ్లొద్దు..

ఈ సందర్భంగా ప్రజలు సాయంత్రం నాలుగు గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అడవికి వెళ్లవద్దని సూచించారు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో చికిత్స కొనసాగుతుందని తెలిపారు. అతనికి పరిహారం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వన్యప్రాణులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటి జోలికి వెళ్లవద్దని సూచించారు. ప్రమాదకరమైన జంతువులు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలుగుబంటి దాడిపై విచారణ జరుగుతుందన్నారు. వారం రోజులకు ముందు ఆ ప్రాంతంలో పెద్దపులి (Tiger) సంచరించినట్లు పాదముద్రలు లభించాయని తెలిపారు. అయితే పెద్దపులి ప్రస్తుతం ఆ ప్రాంతంలో లేదని వివరించారు. పెద్దపులి సంచారం వార్త నేపథ్యంలో ఈ దాడి కూడా అదే చేసిందని ప్రచారం జరిగి ఉండవచ్చని చెప్పారు. కానీ అది వాస్తవం కాదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Drinking Water Supply | జిల్లాలో తాగునీటి సరఫరాలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *