Police misconduct complaint | పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐజీ, హెచ్​ఆర్​సీకి సర్పంచ్​ ఫిర్యాదు

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Police misconduct complaint | న్యాయం చేయాలని వెళ్లిన తనపై బెదిరింపు ధోరణితో మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాజంపేట (Rajampet) మండలం ఆర్గొండ సర్పంచ్ విక్రాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మానవహక్కుల సంఘంతో పాటు ఐజీ చంద్రశేఖర్​ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.

Police misconduct complaint | కామారెడ్డి పట్టణంలో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతనెల 18న కామారెడ్డి పట్టణంలో (Kamareddy Police) ఆర్గొండ గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్ల కుమారుడు హత్యకు గురయ్యాడన్నారు. ఈ కేసులో బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి కామారెడ్డి పోలీసులు నిరాకరిస్తున్నారని తెలుసుకుని తాను బాధితుడి తరపున సర్పంచ్​ హోదాలో కామారెడ్డి పట్టణ పోలీస్​స్టేషన్​కు వెళ్లానన్నారు. అయితే బాధిత తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా తనపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల వేస్తానని పోలీసులు బెదిరించారని.. అక్కడే ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై గత నెల 21న జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని (SP Rajesh Chandra) కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించి తనకు న్యాయం చేయాలని ఐజీ, హ్యూమన్ రైట్స్ కమిషన్​కు కోరానన్నారు.

ఇది కూడా చదవండి: Krishna Water Protest | కృష్ణ జలాల కోసం టీఆర్​ఎస్​ పోరుబాట

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *