అక్షరటుడే, బాన్సువాడ: Siddapur Reservoir | వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ (జనరల్) రమేష్, ఈఎన్సీ (అడ్మిన్) శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
Siddapur Reservoir | ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం..
సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు మే నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రూ.55.30 కోట్లను మంజూరు చేసిందని పోచారం తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో నెం.37ను ఈనెల 8న ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నష్టపరిహారం చెల్లింపులు పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పనుల ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Moram Mining | పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు