Cricket Selections Nizamabad | జిల్లాస్థాయి అండర్-16, అండర్-19 క్రికెట్ ఎంపికలు పూర్తి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: Cricket Selections Nizamabad | నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(Nizamabad District Cricket Association) ఆధ్వర్యంలో స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల(Giriraj Government College) మైదానంలో అండర్-16, అండర్-19 బాలబాలికల క్రికెట్ ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు.

Cricket Selections Nizamabad | ​ఉచిత శిక్షణ..

జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్(Hyderabad) క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు ఈ ఎంపికలు నిర్వహించామన్నారు. అండర్-16 కేటగిరీలో 30 మందిని, అలాగే అండర్-19 కేటగిరీలో 30 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన 60 మంది క్రీడాకారులకు నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు పూర్తిగా ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

​శిక్షణా కాలం పూర్తయిన తర్వాత, వారి ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది చొప్పున అండర్-16, అండర్-19 విభాగాల్లో రెండు తుది జట్లను ఎంపిక చేస్తామని తెలియజేశారు. ఈ జట్లను జిల్లా, రాష్ట్ర స్థాయి (స్టేట్ లెవెల్) క్రికెట్ టోర్నమెంట్లలో ఆడేందుకు పంపిస్తామని తెలిపారు. క్రీడాకారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ​ఈ ఎంపిక కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, ప్రతినిధులు నయీమ్, లలిత్, విక్రమ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Akunuri Murali Resignation | విద్యా కమిషన్​ ఛైర్మన్​ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *